నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రానికి “రూలర్” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య నటిస్తున్నట్టు ఈ పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతోంది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండగా ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల చిత్రానికి సంబంధించి ట్రైలర్స్, సాంగ్స్ విడుదల చేశారు. ఇవి ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెంచాయి. తాజాగా చిత్ర మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో చిత్ర యూనిట్ హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ఇక ఈ చిత్రం నుంచి తాజాగా మరో ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.