telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమిళ నటులపై మండిపడుతున్నరోజా భర్త

selvamani

తమిళనాట ఎవరూ సరిగ్గా స్పందించడం లేదంటూ దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య  అధ్యక్షుడు, ప్రముఖ దర్శకుడు, రోజా భర్త ఆర్.కె.సెల్వమణి మండి పడ్డాడు. నటీనటులకు మానవత్వం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన. దక్షణ భారత సినీ కార్మికుల సమాఖ్యలో 25 వేల మంది సభ్యులుండగా.. అందులో దాదాపు 18 వేల మంది రోజూవారీ వేతనం తీసుకునే చిన్న సినిమా కార్మికులే అని గుర్తు చేసాడు సెల్వమణి. వాళ్లు పని చేసుకుంటే కానీ పూట గడవని పరిస్థితుల్లోనే ఉన్నారు. వాళ్లను ఆర్థిక సాయంతో ఆదుకోవాలంటూ సినీ ప్రముఖులకు ఈయన విజ్ఞప్తి చేసాడు. అయితే సెల్వమణి అడిగినా కూడా చాలా మంది పట్టించుకోలేదు. సూర్య కుటుంబం, రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, ధనుష్ లాంటి వాళ్లు మాత్రమే ఇప్పటి వరకు విరాళం అందించారు. అందులో అందరికంటే ఎక్కువగా రజినీ 50 లక్షలు అందించగా.. మిగిలిన వాళ్లంతా 10 నుంచి 20 లక్షల మధ్యలో ఇచ్చారు. ఇప్పటి వరకు ఫెఫ్సీకి 1.60 కోట్లు, 25 కేజీలతో కూడిన 1983 బస్తాల బియ్యం వచ్చాయని చెప్పాడు సెల్వమణి. దాంతో సమాఖ్యలో ఉన్న ఒక్కో సభ్యుడికి 25 కిలోల బియ్యం, 500 రూపాయలు మాత్రమే సాయం చేయగల్గుతున్నామని.. వాళ్ల కుటుంబానికి ఇది ఏ మాత్రం సరిపోదని ఆర్‌కే సెల్వమణి ఆవేదన వ్యక్తం చేసాడు.

Related posts