telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఉదయం నుంచి ట్విట్టర్ సేవలకు అంతరాయం

twitter accounts blocked on rumors

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ సేవలకు ప్రపంచ వ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. ఈ ఉదయం నుంచి ట్విట్టర్ నిలిచిపోయింది. లాగిన్ అయితే ఎర్రర్ మెసేజ్ వస్తోంది. దీనిపై ట్విట్టర్ సంస్థ వివరణ వచ్చింది.సాంకేతిక లోపం ఎక్కడుందో కనుక్కుని, దాన్ని పరిష్కరించే పనిలో తమ ఉన్నారని తెలిపింది.

త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని ట్విట్టర్ వర్గాలు పేర్కొన్నాయి. ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ కాలేకపోతున్నామంటూ ప్రపంచవ్యాప్తంగా 4000కి పైగా రిపోర్టు చేయడంతో ట్విట్టర్ వర్గాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ముఖ్యంగా, జపాన్, కెనడా, భారత్ నుంచి ఎక్కువ ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది.

Related posts