ప్రముఖ దక్షిణాది నటి పూనమ్ కౌర్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు తెల్లవారు జామున సాంప్రదాయ వస్త్రధారణలో స్వామివారిని దర్శించుకున్నారు పూనమ్. అనంతరం గుడి నుంచి బయటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఎన్నికల నేపథ్యంలో తిరుమలలో రద్దీ తక్కువగా ఉంది. ఇక అక్కడ పూనమ్ ను చూసిన ఆలయ సిబ్బంది, పలువురు భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగారు. ఇలా సార్వత్రిక ఎన్నికలకు ఒకరోజు ముందు పూనమ్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనే విషయం ప్రత్యేకతను సంతరించుకుంది.
బిగ్ బాస్-3 : హిమజ డ్యాన్స్ పై పునర్నవి కామెంట్స్