యంగ్ హీరో నితిన్ గతేడాది ‘బీష్మ’ మూవీతో హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అయితే ఇంతకముందు రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కు అభిమానుల మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం ఓ ఫోటోను విడుదల చేస్తూ ప్రకటించింది. అయితే నితిన్ ఈ సినిమా పూర్తి కావడంతో తన తర్వాతి సినిమా షూట్ లో పాల్గొననున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అంధాధున్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో రాధికా ఆప్టే పోసించిన పాత్రలో నభానటేశ్ కనిపించనుండగా.. టబు రోల్ లో తమన్నా నటిస్తోంది. ఠాగూర్ మధు, నితిన్ హోం బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమా షూటింగ్ లోనే నితిన్ తర్వాత పాల్గొనబోతున్నాడు.
previous post
next post
అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు..సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు