telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు పొడిగింపు

fake claims in gst found and investigating

2017-18, 2018-19 సంవత్సరాలకు గాను జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ గడువును పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫామ్ జీఎస్‌టీఆర్-9 (వార్షిక రిటర్న్), ఫామ్ జీఎస్‌టీఆర్-9సి (సయోధ్య ప్రకటన) ఫైలింగ్ గడువును పొడిగించింది. 2017-18 జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు ఈ నెల 30తో ముగియనుండగా, దానిని ఈ డిసెంబరు 31 వరకు పొడగించింది.

డిసెంబరు 31తో ముగియనున్న 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ ఫైలింగ్ గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. ప్రభుత్వ తాజా ప్రకటనతో పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించినట్టు అయింది. వీటితోపాటు జీఎస్టీ ఫామ్‌లలోని కొన్ని ఫీల్డ్స్‌ను ఆప్షనల్ చేస్తూ మరింత సులభతరం చేసినట్టు సీబీఐసీ తెలిపింది.

Related posts