telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

సెకన్ల వ్యవధిలో కొడుకును కాపాడుకున్న తల్లి… ఎలాగంటే…?

Mom

సెకన్ల వ్యవధిలో కొడుకును కాపాడుకున్న ఓ తల్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. లిఫ్ట్ నుంచి దిగిన తల్లికొడుకు లోపలికి వెళ్తుండగా ఆ తల్లికి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్న తల్లి చేతిని విడిపించుకుని బాలుడు రైలింగ్ నుంచి కిందకు చూడబోయాడు. అంతే అక్కడి నుంచి కిందకు పడబోయాడు. అది గమనించిన తల్లి వెంటనే స్పందించి అతడి కాలును పట్టుకుంది. కాలును అదిమి పట్టుకునే పైకి లాగింది. అది చూసిన భవనంలోని మిగతా వారు వెంటనే అక్కడి చేరుకొని బాలుడిని పైకి లాగారు. దీంతో ఆ బాలుడు క్షణాల వ్యవధిలో మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. ఈ వీడియో కాస్తా బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.

Related posts