telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోనూసూద్ జీవిత కథ “ఐ యామ్ నో మేస‌య్య”

Sonusood

“ఐ యామ్ నో మేస‌య్య” అనే పుస్త‌కంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ మోగా నుండి ముంబైకి వెళ్ళిన అసాధారణ అనుభవాలను ప్రముఖ జర్నలిస్ట్, రచయిత మీనా కె. అయ్యర్ పొందుప‌రిచారు. నిజాయితీ, స్ఫూర్తిదాయకమైన వ్య‌క్తి సోనుసూద్ క‌థ అన్నారు. అదేవిధంగా జీవితాలను రూపాంతరం చెందించుకుంటున్న ప్రజల కథ అని కూడా పేర్కొన్నారు. సోనూ సూద్ జీవితం ఆధారంగా ర‌చించిన “నేనేం ఆప‌ద్భాంద‌వుడిని కాను” (IAmNoMessiah ) పుస్త‌కం డిసెంబ‌ర్‌లో విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని సోనూసూద్ ట్విట్ట‌ర్ ద్వారా స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్పందిస్తూ.. పుస్త‌కం డిసెంబ‌ర్‌లో విడుద‌ల కానున్న‌ట్లు తెలిపేందుకు తానెంతో సంతోషిస్తున్నాన‌న్నారు. ఇది త‌న‌ జీవిత క‌థ అని తెలిపారు. వేలాదిమంది వ‌ల‌స కార్మికుల వ‌లె త‌న క‌థ కూడా అని పేర్కొన్నారు.

కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. వలసదారుల బాధ‌ల‌కు చ‌లించిన సోనూసూద్ వేలాది మంది నిస్స‌హాయ‌, పేద కార్మికుల‌కు స‌హాయం అందించారు. జాతీయ‌, అంత‌ర్జాతీయ ర‌వాణాకు సైతం ఏర్పాట్లు చేశారు. ఘ‌ర్ బేజో కార్య‌క్ర‌మాన్ని మాన‌వ‌తా మిష‌న్‌లాగా చేప‌ట్టారు. చార్ట‌ర్డ్ విమానాలు, బ‌స్సులు, రైలు ప్ర‌యాణా ఏర్పాట్లు చేశారు. ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన ఫోన్‌కాల్స్‌, సందేశాల‌కు త‌క్ష‌ణం స్పందించి స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. లాక్ డౌన్ సమయంలోనే కాదు ఇప్పటికీ ఎవరికీ ఏ సమస్య వచ్చిన ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు. దీంతో సోనూసూద్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోన్న విష‌యం తెలిసిందే. ఐక్యరాజ్యసమితి సైతం ఆయన సేవలను గుర్తించి, ప్రత్యేక అవార్డును ఇచ్చింది.

Related posts