telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విజయవాడ టోల్ ప్లాజా వద్ద వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ హల్ చల్

వడ్డెర కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవళ్ల రేవతి హల్‌ చల్‌ చేశారు. విజయవాడ కాజా టోల్‌ గేట్‌ వద్ద సిబ్బందిపై దాడి చేశారు. టోల్‌ పీజ్‌ చెల్లించకుండా వెళుతున్న రేవతి కారుకు టోల్‌ గేట్‌ సిబ్బంది బారికెడ్లు అడ్డుపెట్టారు. దీంతో వడ్డెర కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవళ్ల రేవతి ఆగ్రహం చెందారు. కోపంతో కారు దిగి ఆమె హల్‌ చల్‌ చేశారు. తన కారు ఆపుతారా అంటూ టోల్‌ గేట్ సిబ్భందిపై దాడికి దిగారు. అంతేకాదు.. రేవతి బారికెడ్లను తోసేశారు. రేవతి హడావిడితో టోల్‌ గేట్ సిబ్బంది చేసేది ఏమీ లేక సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనపై అక్కడే ఉన్న స్థానికులు కూడా స్పందించారు. అధికారం ఉన్న నేపంతో సిబ్బందిపై దాడి చేయడం చాలా దారుణమని… ఆమెను పదవీ నుంచి తొలగించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. దీనిపై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts