telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

18 పేజెస్ నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్…

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ’18 పేజెస్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించారు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు లాంఛనంగా మొదలైంది.  నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. నిఖిల్ కళ్ళకు కాగితపు గంతలు కట్టి దానిపై అనుపమ పరమేశ్వరన్ పెన్నుతో రాస్తున్నట్లు చాలా డిఫరెంట్‌గా ఈ పోస్టర్ ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక అనుపమ ఈ పోస్టర్ పై స్పందిస్తూ.. ‘నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది.’ అంటూ అనుపమ ట్వీట్ చేసింది. 

Related posts