telugu navyamedia
సినిమా వార్తలు

ప్రకాష్ రాజ్.. అండ్ టీం నామినేషన్ దాఖలు..

టాలీవుడ్‌లో నేటి నుంచి మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల హీట్‌ మరింత వేడెక్కిపోయే సీన్ కనిపిస్తోంది. మా ఎన్నికల్లో పోటీ కోసం ఇవాళ్టి నుంచి నామినేషన్లు ప‌ర్వం కొన‌సాగుతుంది. విందు రాజకీయాలతో ఇప్పటికే అట్టుడుకుతున్న ఇండస్ట్రీ మునుముందు మరింతగా అగ్గి రాజేయబోతోంది. ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ఎపిసోడ్స్ ఆద్యంతం రక్తి కట్టిస్తుండగా.. తెరవెనక దిగ్గజాలు నడిపిస్తున్న పోరుగా దీనిని అంతా చూస్తున్నారు.

తాజాగా ‘మా’ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకాశ్‌ రాజ్ ఈ రోజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయనతో పాటు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులు కూడా నామినేషన్‌ దాఖలు చేశారు.’మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈరోజు మధ్యాహ్నమే సీవీఎల్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నేటి నుంచి నుంచి ఈ నెల 29 వరకూ నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. 30న నామినేషన్‌ల పరిశీలన ఉండనుంది.

అనంతరం నామినేషన్‌ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఇస్తారు. నామినేషన్ వేసిన వారెవరైనా వెనక్కి తగ్గాలనుకుంటే… అప్పటికే వారు వేసిన నామినేషన్ ను వాపస్ తీసుకోవచ్చు. అక్టోబర్ రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు

కాగా.. మా ఎన్నిక‌లు అక్టోబర్‌ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనున్నాయి.అదే రోజు సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తారు. అధ్యక్ష పదవికి ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహారావు పోటీ పడుతున్నారు. ఇక జనరల్ సెక్రటరీ పదవికి.. బండ్ల గణేష్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.

MAA Elections 2021:Actor Prakash raj introduces his panel | ''మా'' ఎన్నికలు 2021: తమ ప్యానెల్‌ను పరిచయం చేసిన ప్రకాష్ రాజ్ - Oneindia Telugu

ప్ర‌కాష్ రాజ్ ప్యానల్ లో 18 మంది ఎక్జిక్యూటివ్ మెంబెర్స్ ..

జయసూధ, అనసూయ, అజయ్,  భూపాల్,  బ్రహ్మాజీ, ఈటీవి ప్రభాకర్,  గోవింద్ రావు,  ఖయ్యుం, కౌశిక్,   ప్రగతి, రమణారెడ్డి,  శ్రీధర్ రావు, శివారెడ్డి,  సమీర్, సుడిగాలి సుధీర్,  సుబ్బరాజు, సురేష్ కొండేటి,  తనీష్, టార్జాన్ ఉన్నారు 

ఇందులో అధ్యక్షుడి అభ్యర్థిగా ప్రకాష్ రాజ్, కోశాధికారి-నాగినీడు-జాయింట్ సెక్రటరీ…అనితా చౌదరి-జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్-వైస్ ప్రెసిడెంట్‌‌గా బెనర్జీ-వైస్ ప్రెసిడెంట్‌‌గాహేమ-ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌‌గాశ్రీకాంత్-జనరల్ సెక్రెటరీగా జీవిత రాజశేఖర్

 

Related posts