telugu navyamedia
క్రీడలు వార్తలు

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గెలిచేది ఆ జట్టే అంటున్న కేకేఆర్ కోచ్…

డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత్-న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ టీమ్.. ఇంగ్లాండ్‌లో టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉన్నప్పటికీ.. దాన్నెవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ నెల 18వ తేదీన ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ చారిత్రాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విన్నర్ ఎవరనే విషయంపై డిబేట్లు కూడా మొదలయ్యాయి. తొలి ఛాంపియన్‌గా ఎవరు ఆవిర్భవిస్తారనే విషయంపై ప్రిడిక్షన్స్ ఆరంభమయ్యాయి. ఈ మ్యాచ్‌లో కివీస్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని న్యూజిలాండ్‌ మాజీ కేప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అంచనా వేశాడు. గెలుపు కోసం హోరాహోరి పోరు తప్పదని చెప్పాడు. మ్యాచ్ చివరి రోజు వరకూ సాగుతుందని, ఉత్కంఠభరితంగా ఉంటుందని పేర్కొన్నాడు. న్యూజిలాండ్-భారత్ మధ్య 60-40 అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశాడు. కివీస్ టైటిల్ ఛాంపియన్‌గా ఆవిర్భవించడానికి 60 శాతం ఛాన్సులు ఉన్నాయని చెప్పాడు. ఇంగ్లాండ్ వాతావరణం, అక్కడి పిచ్‌లపై అవగాహన, ప్లేయర్ల ఆటతీరును పరిగణనలోకి తీసుకుని తాను ఈ అంచనాకు వచ్చినట్లు వివరించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్.. ఇంగ్లాండ్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడబోతోండటం కూడా కలిసి వస్తుందని మెక్‌కల్లమ్ అభిప్రాయపడ్డాడు. జట్టులో లోటుపాట్లను సవరించుకోవడానికి, ఇంగ్లాండ్ వాతావరణానికి అలవాటు పడటానికి ఈ రెండు మ్యాచ్‌లు ఉపకరిస్తాయని చెప్పాడు.

Related posts