పాకిస్థాన్ యంగ్ ప్లేయర్ నసీమ్ షా భారత వన్డే టీమ్ వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మను ఔట్ చేయడం తన కల అంటూ ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ నసీమ్.. వైస్ కెప్టెన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘రోహిత్‌కు అన్ని బంతులూ ఆడే టాలెంట్ ఉంది. అతడి గురించి మనకంటే ఎక్కువ రికార్డులే మాట్లాడతాయి. అతడి వికెట్ తీస్తే నా డ్రీమ్ నిజమవుతోంది. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్ టెక్నిక్ నన్ను ఆశ్యర్యపరుస్తుంది. అతడిని ఔట్ చేయడం కూడా నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. గతంలో స్మిత్‌కు బౌలింగ్ చేసే ఛాన్స్ లభించింది. కానీ ఔట్ చేయలేకపోయా’ అని నషీమ్ పేర్కొన్నాడు. అయితే రోహిత్, స్మిత్‌ను ఔట్ చేయాలంటే నసీమ్ ఇంకా చాలాకాలం వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే పాకిస్థాన్ ఇప్పట్లో భారత్ తో కానీ, ఆస్ట్రేలియాతో కానీ ఆడే అవకాశం కనిపించడం లేదు. అయితే, వచ్చే నెలలో మాత్రం ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ను ఔట్ చేసే ఛాన్స్ మాత్రం ఈ యువ పాక్ బౌలర్‌కు ఉంది. ఆగస్టు 5 నుంచి ఇంగ్లాండ్, పాక్ టీమ్స్ మూడు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే.
previous post