telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలి : అచ్చెన్నా

achennayudu tdp

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని… జగన్‌ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లి ఏపీ పరువు తీయొద్దని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇవాళ తిరుపతిలో చేపట్టిన ధర్మపోరాట యాత్ర నేపథ్యంలో అచ్చెన్నాయుడుతో సహా పలుగురు టీడీపీ నేతలు అరెస్ట్‌ అయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అచ్చెన్నాయుడు స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్ర బలగాల సహకారంతో జరగాలని…రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు.. వాళ్లు వైసీపీ కార్యకర్తల్లా మారారని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. ధర్మపోరాట యాత్ర చేపడితే ప్రభుత్వానికి ఎందుకంత భయంమని.. ఈ యాత్రను ఎలాగైనా కొనసాగించి తీరుతామని తెలిపారు. కాగా..పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై రెండు రోజులు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుపుకోవచ్చు అని హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరిచింది. 

Related posts