telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నిమ్మగడ్డ అనుకున్నంత మాత్రన ఎన్నికల కోడ్‌ అమలు కాదు : పేర్ని నాని

స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఏపీలో మరింత హాట్‌టాపిక్‌గా మారిపోయింది. తాజాగా… స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహరంలో జగన్‌ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. ఈ తీర్పుపై మంత్రి పేర్నినాని స్పందించారు. నిమ్మగడ్డ అనుకున్నంత మాత్రన ఎన్నికల కోడ్‌ అమలు కాదని.. న్యాయమూర్తులు మారినా ధర్మం గెలవాలనే కోరుకుంటున్నామని పేర్నినాని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళతామని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యమని.. న్యాయ నిపుణులు, అధికారులతో చర్చిస్తామన్నారు. ఇక అటు ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల కార్యాలయ సిబ్భందితో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సమావేశం నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల కోడ్‌ కూడా అమల్లోకి వచ్చినట్టేనని ఎస్‌ఈసీ అంటోంది. ఎల్లుండి నుంచి 4 విడతల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. కాగా.. ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఎస్ఈసి గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

Related posts