telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

రైతుబజార్‌లో కిలో ఉల్లి రూ.40..ఆధార్‌ కార్డ్ తప్పనిసరి

onions

హైదరాబాద్ నగరంలోని రైతుబజార్‌లో ప్రారంభించిన సబ్సిడీ ఉల్లి కేంద్రాలకు భారీ స్పందన లభిస్తోంది. సామాన్యులపై ప్రభావం పడకుండా ప్రభుత్వం సబ్సిడీ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. వనస్థలిపురంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఉల్లి కొనుగోలుకు ఇక్కడికి వస్తున్నారు. ప్రజల నుంచి స్పందన వస్తుండడంతో అందరికీ అందేలా ఆధార్‌ కార్డును నమోదు చేసుకుని రూ.40కి కిలో చొప్పున రోజుకు సగటున పది క్వింటాళ్ల వరకు విక్రయిస్తున్నట్లు రైతు బజార్‌ సిబ్బంది తెలిపారు.

ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 7గంటల వరకు విక్రయ కేంద్రాలు పని చేస్తున్నాయి.మార్కెట్‌లో భారీగా పెరిగిన ఉల్లి ధరకు కళ్లెం వేయడంతోపాటు, సామాన్యులపై ఆ ప్రభావం పడకుండా ప్రభుత్వం సబ్సిడీ కేంద్రా లను ఏర్పాటు చేసి, అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.బహిరంగ మార్కెట్‌లో ఉల్లిగడ్డ రూ.80నుంచి 100కు అమ్ముతున్నారు. సబ్సిడీపై రైతుబజార్‌లో రూ.40కి కిలో చొప్పున అందిస్తున్నారు.

Related posts