telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

బెంగళూరు : … హజారే ట్రోఫీ .. కర్ణాటక వశం…

karnataka team got hajare trophy

కర్ణాటక జట్టు హజారే ట్రోఫీని కైవసం చేసుకుంది. కర్ణాటక (విజెడి పద్ధతిలో) 60 పరుగుల తేడాతో గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు 253 పరుగులు సాధించగా, అందుకు ధీటుగా బ్యాటింగ్‌ చేసింది కర్ణాటక. 23 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 146 పరుగులతో ఉన్న సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆపై ఫలితం కోసం విజెడి పద్ధతిని అవలంభించి కర్ణాటకను విజేతగా తేల్చారు. కర్ణాటక ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ (72 బంతుల్లో 5ఫోర్లతో 52నాటౌట్‌), మయాంక్‌ అగర్వాల్‌ (55బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్లతో 69నాటౌట్‌)లు మెరిశారు. వీరిద్దరూ అజేయంగా 112 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి కర్ణాటకకు పటిష్ట స్థితిలో నిలిపారు.

ఈ టోర్నీలో కెఎల్‌ రాహుల్‌ 598 పరుగులు సాధించాడు. భారత ఇంజనీర్‌ విజయదేవన్‌ రూపొందించిన విజెడి పద్ధతిని మ్యాచ్‌ రద్దయిన పరిస్థితుల్లో ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా భారత్‌లో జరిగే దేశవాళీ టోర్నీలో వర్షం పడి మ్యాచ్‌ ఆగిపోతే ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. టాస్‌ గెలిచిన కర్ణాటక తొలుత తమిళనాడును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో అభనవ్‌ ముకుంద్‌-మురళీ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు.

Related posts