telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఓటర్లకు డబ్బులు ఇద్దాం అంటున్న ఎమ్మెల్యే వీడియో బయటికి…

ప్రస్తుతం తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల హిట్ ఉంది. అయితే నిన్నటితో ఈ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఈ క్రమంలో ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న ఒక ఎమ్మెల్యే కామెంట్స్ సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లా వైరా కు చెందిన ఎంఎల్ఎ రాములు నాయక్ గతంలో స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిపోయాడు.  ఎంఎల్సి ఎన్నికల సందర్భంగా కార్యకర్తలతో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఓటర్లను ఎ, బి , సి గా విభజించండి.. వారిలో మనకు ఓట్లు వేసే వారు, కొంత డవుట్ ఫుల్ గా ఉన్నవారు, అదే విధంగా ఓట్లు వేయరనుకున్న వారిని గుర్తించండి. వారికి డబ్బులు కూడా ఇద్దామని చెబుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. భయపడాల్సిన అవసరం కూడా  లేదని, ఖర్చుల కోసం డబ్బులు ఇద్దామని చెబుతున్నారు. మొత్తం మీద రాములు నాయక్ బహిరంగంగానే భయం లేకుండా డబ్బు పంపిణీ చేద్దాం అని చెప్పడం అది వైరల్ గా మారింది… గత రాత్రి నుంచి గ్రామాల్లో డబ్బులు పంపిణీకి ఏర్పాట్లు జరిగినట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి దీని పై ప్రత్యర్థి పార్టీలు, పోలీసులు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts