telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దేశ విభజన జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనిక దేశం అవుతుంది : రేవంత్ రెడ్డి

revanthreddy campaign in huzurnagar

అబద్ధాలు చెప్పడంలో మోదీ, కేసీఆర్ ఒకరిని మించిన వారు ఒకరని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్ లో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదని.. గతంలో బీహార్ కు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారు .. ఏమైంది ..? అని ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టడం మోదీ, కేసీఆర్ లకు వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు. జమిలీ ఎన్నికలు జరిగితే .. దేశం రెండుగా విడిపోవడం ఖాయమని.. అధ్యక్షడు కావడానికి దక్షిణ భారత్ ఓట్లు అవసరం పడవన్నారు. అధ్యక్షుడికి నేరుగా ఎన్నికలు జరిగితే .. దక్షిణ భారత ప్రజలు సున్నాగా మారుతారని.. జమిలి ఎన్నికలు జరగగానే .. దేశ విభజన ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని హెచ్చరించారు. దేశ విభజన జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనిక దేశం అవుతుందని.. దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరం లేకుండా అధ్యక్షుడి ఎన్నిక జరిగినప్పుడు .. ఇక్కడి ప్రజలు ఎందుకు ఊరుకుంటారని మండిపడ్డారు. మోదీ ప్రధాని అయ్యాక దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిందని..మోదీ ప్రధాని అయ్యాక ప్రాధాన్య కలిగిన కేంద్ర మంత్రి పదవులను ఉత్తరాది వారికే కట్టబేడుతున్నారని ఆరోపించారు. ట్యాక్స్ అత్యధికంగా కడుతుంది దక్షిణ భారత్ రాష్ట్రాల వారే .. కానీ నిధులు ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతున్నాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల వివక్షకు కారణమయ్యే జమీలి ఎన్నికల ఆలోచనను మోదీ విరమించుకోవాలని లేకుంటే ఈ అన్ని అంశాలను పార్లమెంట్ లోనే మాట్లాడుతానన్నారు.

Related posts