telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

పుదీనా రెగ్యూలర్ గా వాడుతున్నారా… అయితే ఇవి తెలుసుకోండి !

పుదీనా అంటే తెలియని వారుండరు. ఎందుకంటే ప్రతి ఇంట్లో పుదీనా కనిపిస్తుంది. పుదీనాను ఎక్కువగా మజ్జిగలో వాడుతారు. ఈ మధ్యలో గ్రీన్‌ టీలోనూ ఎక్కువగా వాడుతున్నారు. అయితే.. ఈ పుదీనా వల్ల శరీరానికి ఎంతో మేలు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పుదీనాను మనం రెగ్యూలర్‌గా తీసుకోవాలి
పుదీనా లాభాలు :
పుదీనాను తీసుకోవడం వల్ల ఎండాకాలంలో మన శరీరానికి చల్లదనం లభిస్తుంది.
వేసవిలో మాంసాహారం తింటే కొందరికి పడదు. అందుకని వారు పుదీనాను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరం వేడి చేయకుండా ఉంటుంది.
జీర్ణ సమస్యలతో బాధపడేవారు పుదీనాను తీసుకుంటే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
దగ్గు, జలుబు, నోటి దుర్వాసన సమస్యలు ఉన్నవారు పుదీనాను తింటే ఫలితం ఉంటుంది.
పుదీనాను రోజూ తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Related posts