telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కొడాలి పై ఎస్‌ఈసీ చర్యలు…

మంత్రి కొడాలి నానికి షోకాజు నోటీసులు జారీ చేసింది ఎస్‌ఈసీ.. అయితే, ఎస్‌ఈసీకి మంత్రి కొడాలి నాని ఇచ్చిన వివరణపై ఎన్నికల కమిషన్‌ సంతృప్తి చెందలేదు.. దీంతో.. మంత్రి కొడాలి నాని వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్.. చర్యలకు పూనుకున్నారు.. మంత్రి కొడాలిపై ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన ఆదేశాల్లో మంత్రి తీరును తప్పుబట్టారు ఎస్ఈసీ.. తాను చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొడాలి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడం లేదని పేర్కొన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్… మంత్రి కొడాలి ఎన్నికల సమయంలో ఈ తరహా కామెంట్లు చేయడం ప్రమాదకరం అన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఎస్ఈసీని కొంత కాలంగా మంత్రి విమర్శిస్తూనే ఉన్నారని ఆదేశాల్లో పేర్కొన్నారు.. ముఖ్యమంత్రి పతనాన్ని ఎస్ఈసీ కోరుతుందంటూ మంత్రి చేసిన కామెంట్లు సరికాదన్న నిమ్మగడ్డ… రాష్ట్రాధినేతగా సీఎం మీద తనకు.. కమిషన్‌కు సంపూర్ణ గౌరవం ఉందని స్పష్టం చేశారు. ఎన్నికలయ్యేంత వరకు మీడియాతో మాట్లాడే అంశంలో నిగ్రహం పాటించాలంటూ కొడాలిని ఆదేశించింది ఎస్‌ఈసీ.. సమావేశాల్లోనూ సంయమనం పాటించాలని ఆంక్షలు విధించింది. చుడాలిమరి ఏం జరుగుతుంది అనేది.

Related posts