telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు సృష్టిస్తే కాల్చివేయండి…

riyago

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని దేశాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రీగో లాక్ డౌన్ సమయంలో ఎవరైనా ఇబ్బందులు సృష్టిస్తే వారిని కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ‘ఇది అందరికి ఓ హెచ్చరిక.. ఇప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఈ సమయంలో గవర్నమెంట్ ఆదేశాలను ఖచ్చితంగా పాటించండి అని ఆ దేశ ప్రజలకు స్పష్టం చేశారు. మరోవైపు వైద్య సిబ్బంది మీద దాడి చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ ఎవరైనా చేస్తే వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చెయ్యండని మిలిటరీ, పొలిసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అటు కరోనా వైరస్ ఫిలిప్పీన్స్ దేశంలో కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 2,300 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈ మహమ్మారి బారిన పడి దాదాపు వంద మంది మరణించారు.  

Related posts