దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఉత్కంఠ పోరులో నువ్వా..నేనా అన్నట్టు టీఆర్‌ఎస్, బీజేపీలు తలపడ్డాయి. మొదటి రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలోకి రాగా.. తర్వాతి రౌండ్లలో టీఆర్‌ఎస్ దుమ్ములేపింది. అనంతరం మళ్లీ బీజేపీ ముందుకు వచ్చింది. ఇలా దుబ్బాక ఉప ఎన్నిక టీ-20 మ్యాచ్ ను తలపించింది. ఎట్టకేలకు ఈ ఉత్కంఠ పోరులో బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు స్వల్ప మెజారిటీతో గెలుపొందాడు. అయితే.. ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం కొనయిపల్లి గ్రామానికి చెందిన కొత్తింటి మల్లయ్య కుమారుడు స్వామి (34) టిఆర్ఎస్ ఓడిపోయిన నేపద్యంలో మనస్తాపానికి గురై చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ విషయం తెలిపిన మంత్రి హారీష్ రావు స్వామి మృత దేహానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి…భరోసా కల్పించారు. అంతక్రియల్లో పాల్గొని స్వామి పాడెను మంత్రి హరీష్ రావు మోసారు.
previous post