telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దాతల నమ్మకాన్ని వమ్ము చేశాడని గౌరవ్ వాసన్ పై విమర్శలు…

ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ ఈ వీడియో ద్వారా డబ్బు చేసుకుంటున్నాడని, మరో స్వఛ్ఛంధ సేవా కార్యకర్త మధు “ఇన్ స్టాగ్రామ్” లో పెట్టడం పెద్ద చర్చనీయాంశం గా మారింది. తుషాంత్ అనే మరో కార్యకర్త కూడా సోషల్ మీడియా ను వేదికగా చేసుకుని గౌరవ్ వాసన్ పై విమర్శలు గుప్పించడంతో పాటు, “బాబా” బ్యాంకు అకౌంట్ కే నేరుగా ఆర్ధిక సహాయం చేయాలని కోరాడు. దీంతో నెటిజన్లు గౌరవ్ వాసన్ ను వివరణ అడిగారు. “మా కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్లు ఎవరైనా చూసుకోవచ్చని, 2 లక్షల రూపాయల మేరకే “బాబా”కు ఆర్ధిక సహాయం లభించిందని, అది “బాబా” కు అందజేస్తానని” గౌరవ్ వాసన్ చెప్పాడు.

“ఇలా చేస్తే, భవిష్యత్‌లో ఎవరికైనా నిజంగా సహాయం కావాల్సినప్పుడు నష్టం జరుగుతుంది. “నెటిజన్లు” కు నమ్మకం కలగదు. ఇది మంచిది కాదు”, అని తుషాంత్ వ్యాఖ్యానించాడు. “బాబా” కు ప్రస్తుతం తుషాంత్ సహాయం అందిస్తున్నాడు. వచ్చిన రద్దీ కి తగ్గట్టుగా స్పందించి, సమర్ధించుకునే చాకచక్యం, చురుకుదనం “బాబా” పెద్ద కుమారుడు ఆజాద్ కు లేకపోవడంతో, తుషార్, మరికొంత మంది కార్యకర్తలు ఉచితంగా “బాబా”కు అండగా ఉన్నారు. ఇలా వేలాది మంది చాలా స్వఛ్చందంగా స్పందించారు.

Related posts