telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బిజెపి ఎంపిల వల్ల రాష్ట్రానికి ఎటువంటి లాభం లేదు

కేంద్రబడ్జెట్‌పై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. నేటి కేంద్ర బడ్జెట్ కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాల బడ్జెట్ లాగా ఉంది తప్ప, దేశ బడ్జెట్ కాదని పేర్కొన్నారు. 3 లక్షల కోట్ల రూపాయల దేశ ప్రజల బడ్జెట్ ను కేవలం 5 రాష్ట్రాలకు ఇవ్వడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగ అధికార బిజెపి అన్యాయం చేసిందని ఫైర్‌ అయ్యారు. బిజెపి ఎంపిల వల్ల రాష్ట్రానికి ఎటువంటి లాభం లేదని… రాష్ట్ర అవసరాలు, ప్రతిపాదనలు ఒక్కటి కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావన చేయలేదని నిప్పులు చెరిగారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆరు సంవత్సరాలకు ప్యాకేజి ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనని…. ఇప్పటికే రెండేళ్లు పూర్తైంది… ఇక మిగిలింది మూడేళ్లైతే, ఆరేళ్లకు ఎలా ప్యాకేజీ ప్రకటిస్తారని మండిపడ్డారు. కనీస మద్దతుధర పై కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావన లేదని.. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా, మేలు చేసే చర్యలు బడ్జెట్ లో లేవని పేర్కొన్నారు. విభజన చట్టంలోని అంశాలపై ప్రస్తావన లేదని… కేవలం అహ్మదాబాద్ కు బుల్లెట్ ట్రైన్ తప్ప దేశంలో మిగిలిన రాష్ట్రాల గురించి పట్టించుకోవడం లేదన్నారు. రద్దు చేసిన “ఎంపిలాడ్స్” నిధులను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్‌ చేశారు.

Related posts