telugu navyamedia
సినిమా వార్తలు

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ టీజర్ ఎప్పుడంటే..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “బింబిసార”. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఈ నేప‌థ్యంలో నుంచి “బింబిసార” నుంచి అప్డేట్ వచ్చింది. సినిమా టీజర్​ను నవంబరు 29న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర‌యూనిట్‌.

ఇప్పటికే విడుదలైన కల్యాణ్​రామ్ లుక్స్ ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో ఆట్టుకుంటున్నాయి.  వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది.‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో కథానాయిక.

క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది.  కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో తొలిసారి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నారు. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా కళ్యాణ్ రామ్ ఇందులో కనిపించనున్నారు.

నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె నిర్మిస్తోన్న ఈ సినిమా.. డిసెంబరులో లేదా సంక్రాంతి తర్వాత థియేటర్లలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నందమూరి అభిమానులు మరో రెండ్రోజుల్లో విడుదల కానున్న సినిమా టీజర్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

Related posts