telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్‌ చివరి చిత్రం “దిల్‌ బేచారా” విడుదల ఈరోజే…

Dil-bechara

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చివరిగా నటించిన చిత్రం ‘దిల్‌ బేచారా’. ఈ సినిమాలో సుశాంత్‌కు జోడిగా సంజనా సంఘి నటించారు. ఈ సినిమా 2014లో హాలీవుడ్ లో వచ్చిన ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’కు ఈ సినిమా రీమేక్ గా తీశారు.  క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఉచితంగా చూడవచ్చని, ఇది ప్రతి ఒక్కరి స్థాయిలో చిరస్థాయిగా నిలుస్తుందని, ప్రేమ, ఆశ, అంతులేని జ్ఞాపకాల సమాహారమే ఈ చిత్రమని డిస్నీ ప్లస్, హాట్ స్టార్ వెల్లడించింది. ఇక “దిల్ బేచారా” ఇవాళ రాత్రి 7.30 నిమిషాలకు డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్‌ కానున్నది. దిల్ బేచారా ట్రైలర్, పాటలు ఇప్పటికే అందర్నీ ఎమోషనల్‌గా టచ్ చేశాయ్. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ప్రపంచంలో అత్యధిక లైక్స్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. అది సుశాంత్‌కు అభిమానులు ఇచ్చిన నివాళి. సుశాంత్ చివరి చిత్రం కావడం, సుశాంత్ మరణం ఇంకా అందర్నీ వెంటాడుతూ ఉండటంతో దిల్ బేచారాపై అందరూ ప్రత్యేకంగా శ్రద్ద చూపిస్తున్నారు. ఈ చిత్రం గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Related posts