telugu navyamedia
తెలంగాణ వార్తలు

సీఎం కుర్చీ కోసం ప్రగతిభవన్​లో కొట్లాట షూరూ..

తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని.. నియంత, కుటుంబ పాలన కొనసాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజల ద్రుష్టి మళ్లించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడో అర్ధం కాలేదన్నారు.

అపాయిట్ మెంట్ ఇవ్వలేదనే సాకుతో ఆత్మగౌరవం సెంటిమెంట్ ను రాజేద్దామనుకున్నాడన్నారు. అపాయిట్ మెంట్ అడగనేలేదని పీఎంవో చెప్పడంతో కేసీఆర్ కుట్ర ప్రజలకు అర్ధమైందన్నారు. సొంత పనుల కోసం ఢిల్లీకి వెళ్ళిన కేసీఆర్.. అపాయిట్ మెంట్ పేరుతో బీజేపీని అప్రతిష్టపాలు చేయ‌డాని కుట్ర చేశాడన్నారు.

సీఎం కుర్చీ కోసం ప్రగతిభవన్​లో కొట్లాట మొద‌లైందని తెలిపారు. తమను సీఎం ఎప్పుడు చేస్తావని కుమారుడు, కుమార్తె, అల్లుడు అడుగుతున్నారని అన్నారు. అందుకే ఉన్నన్ని రోజులు తానే సీఎంగా ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నాడన్నారు.

తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కలిసికట్టుగా చేస్తున్న పోరాటంతో అనేక మార్పులు సంభవించాయి. తెలంగాణ రైతాంగాన్ని ఏ విధంగా అదుకున్నారో కేసీఆర్ చెప్పాలని అన్నారు.. ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఫీల్డ్ అసిస్టెంట్, వైద్య సిబ్బందిని తొలగించారు. ఎస్సీ ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి హామీలు విస్మరించి.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను కేసీఆర్ దారి మళ్లించారు. మతపరమైన రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. 80శాతం ఉన్న హిందువులు ఓటు బ్యాంకుగా మారితే.. తెరాస, మజ్లిస్ కుట్రలను భగ్నం చేయవచ్చు

కేసీఆర్‌ ప్రశ్నించే గొంతుకలను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారన్న సంజయ్ ..కేసీఆర్‌ పోకడలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. త్వరలోనే తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి.2023లో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని..అందుకోసం రక్తం ధారబోసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.. తాము అధికారంలోకి వస్తే.. అర్హులందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ర

Related posts