రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డిని ఓ దుండగుడు ఆమె కార్యాలయంలోనే సజీవదహనం చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలకం రేపుతుంది. సురేశ్ అనే వ్యక్తి విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు.
ఈ దహనకాండకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ ను ఆదేశించారు. మహిళా అధికారులపై ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు.
ఎవరు మంత్రులుగా ఉన్నా జనాలకు ఒరిగేదేమీ లేదు: జగ్గారెడ్డి