telugu navyamedia
సినిమా వార్తలు

క‌మ‌ల్ స్థానంలో ఛాన్స్‌ కొట్టేసిన‌ ర‌మ్య‌కృష్ణ..

ప్ర‌ముఖ సినీ నటి రమ్యకృష్ణ బంపర్ ఆఫర్ కొట్టేసింది. వ‌ర‌ల్డ్ బిగ్ స్ట్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌.. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ విజయవంతంగా కొనసాగుతుంది. హిందీ, తెలుగు, తమిళంలో ప్రస్తుతం ఐదో సీజన్‌ నడుస్తోంది. తెలుగు షోకి కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించగా, తమిళంలో లోకనాయకుడు కమల్‌ హాసన్‌ వ్యాఖ్యాతగా ఉన్నారు.

Ramya Krishnan - IMDb

అయితే కొన్ని వారాలపాటు తమిళ బిగ్​బాస్-5కు హోస్ట్​గా ర‌మ్య‌కృష్ణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు హోస్ట్ చేసిన విలక్షణ నటుడు కమల్​ హాసన్​ ఇటీవల కొవిడ్ బారిన పడటమే ఇందుకు కారణం. ఇటీవల యూఎస్​ వెళ్లి వచ్చిన కమల్​హాసన్​కు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. దీంతో ఆయన క్వారంటైన్​లోకి ఉండి చికిత్స పొందుతున్నారు. దీంతో బిగ్‌బాస్‌ సీజన్‌ 5కి కొత్త హోస్ట్‌ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తొలుత‌ కమల్‌ ప్లేస్‌లో తాత్కాలికంగా కమల్ కుమార్తె, హీరోయిన్ శ్రుతిహాసన్​ను ఇందుకోసం ఎంపిక చేశారట. కానీ ఏమైందో ఏమోగానీ చివర్లో ఆమెను కాదని ఆ ఛాన్స్ రమ్యకృష్ణను వరించినట్లు తెలుస్తోంది.

Ramya Krishnan To Host Bigg Boss Tamil 5 As Kamal Haasan Rec...

ఇప్పటికే ఈమెకు తెలుగు బిగ్​బాస్​లోనూ హోస్ట్​గా చేసిన అనుభవం ఉండటం కలిసొచ్చింది.నాగార్జున తన 60వ బర్త్ డే సందర్భంగా విహార యాత్ర కోసం ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లిన క్రమంలో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో హోస్ట్‌గా రమ్యకృష్ణ రంగ ప్రవేశం చేశారు. రెండు రోజులపాటు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అందుకే తమిళ బిగ్‌బాస్‌కి కూడా రమృకృష్ణనే తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారట.

Related posts