telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాజల్ పెళ్ళి డ్రెస్… 20 మంది కార్మికులు, నెల రోజుల శ్రమ…!

Kajal

టాలీవుడ్ చందమామ, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఇల్లాలిగా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 30న తన ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు ఈ నవ దంపతులకు స్పెషల్‌గా విషెస్ చెబుతున్నారు. ముంబైలోని స్టార్ హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్‌లో కాజల్- గౌతమ్ వివాహ వేడుక జరిగింది. పంజాబీ, కశ్మిరీ సంప్రదాయల్లో ఈ వేడుక నిర్వహించారు. కేవలం ఇరు కుటుంబాల సన్నిహితులు, దగ్గరి బంధువులు మాత్రమే కాజల్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. హోమ్ డెకార్, ఇంటీరియర్ డిజైన్ కంపెనీని నడిపిస్తూ ప్రముఖ వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు కాజల్ భర్త గౌతమ్ కిచ్లు. ప్రస్తుతం కాజల్ పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లిలో ఆమె గులాబీ రంగు లెహెంగాను ధరించి అందంగా కనిపించింది. దీని డిజైనింగ్ రహస్యాన్ని డిజైనర్ అనామికా ఖన్నా, తన ఇన్ స్టాగ్రామ్ లో తెలిపింది. నిష్ణాతులైన 20 మంది కార్మికులు, నెల రోజులు పాటు శ్రమించి దీన్ని తయారు చేశారని ఆమె తెలిపింది. ఫ్లోరల్ డిజైన్ ఎంబ్రాయిడరీలో దీన్ని తయారు చేశామని వెల్లడించింది. ఆమె ధరించిన ఆభరణాలను సునీతా షెకావత్ చేతితో తయారు చేశారని పేర్కొంది. కాజల్ పై తనకెంతో ప్రేమాభిమానాలు ఉన్నాయని, అందుకే తాము డ్రెస్ కోసం ఇంతగా శ్రమించామని వెల్లడించింది.

Related posts