శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. రేపు ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బ్లాస్ట్ చేయబోన్నానంటూ ఓ ఆగంతకుడు మెయిల్ పంపాడు. సాయిరాం కాలేరు అనే మెయిల్ ఐడీతో విమానాశ్రయానికి మెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్ట్ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
ఒకవైపు తనిఖీలు చేస్తూనే మరో వైపు ఆగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటి వరకు ఎలాంటి బాంబును గుర్తించలేదని సమాచారం.