కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజా ప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడ్డారు.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను కూడా టచ్ చేసింది కరోనా.. తాజాగా..టీడీపీ నాయకులు, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా కరోనా బారిన పడ్డారు.. గత రెండు రోజులుగా ఆయన స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా… పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు. గత వారం రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్ట్‌లు చేయించుకోవాల్సింది అని కోరారు. కాగా..గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో ఆయన సైలెంట్ అయిపోయారు.
previous post
రజినీకాంత్ రాజకీయ ఎంట్రీపై భారతీరాజా కామెంట్స్