telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

5/13 కే .. స్పీకర్ స్పందన.. ఇంకో అవకాశం అంటూ… హింట్..

karnataka govt ball into governor hands

కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామాలు చేసిన 13 మంది ఎమ్మెల్యేల్లో 5 మంది రాజీనామాలు చట్టపరంగా ఉన్నాయని అన్నారు. 8 మంది రాజీనామా లేఖలు చట్ట బద్దంగా లేవని స్పీకర్ రమేష్ కుమార్ రెబల్ ఎమ్మెల్యేలకు గట్టి షాక్ ఇచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ మరో అవకాశం ఇచ్చారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా చేసిన ఎమ్మెల్యేల లేఖలు తాను పరిశీలించానని అన్నారు. చట్టబద్దంగా రాజీనామాలు చెయ్యని ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇస్తున్నానని స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు.

ఈ నెల 12న రాజీనామాలు చేసిన ఆనంద్ సింగ్, రామలింగా రెడ్డి, నారాయణగౌడలు తనను కలవడానికి అవకాశం ఇస్తున్నానని స్పీకర్ రమేష్ కుమార్ చెప్పారు. 8 మంది ఎమ్మెల్యేలు మరోసారి చట్ట బద్దంగా రాజీనామా చెయ్యడానికి తాను అవకాశం ఇస్తున్నానని స్పీకర్ రమేష్ కుమార్ తెలిపారు. స్పీకర్ రమేష్ కుమార్ వివరణతో మరోసారి రాజీనామాలు చెయ్యడానికి 8 మంది రెబల్ ఎమ్మెల్యేలు సిద్దం అవుతున్నారు. జులై 12వ తేదీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అంతుకు ముందే రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చెయ్యాలని రెబల్ ఎమ్మెల్యేలు ఓ నిర్ణయానికి వచ్చారని తెలిసింది.

Related posts