telugu navyamedia
వార్తలు సామాజిక

పట్టలేక్కిన ప్రత్యేక రైళ్లు..హెల్త్ ప్రొటోకాల్స్ తప్పనిసరి!

trains Indian railways

అన్‌లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం ప్రకటించిన 80 ప్రత్యేక రైళ్లకు నిన్నటి నుంచి రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో రైళ్లు మళ్లీ పరుగులు ప్రారంభించాయి.

రైలు ప్రయాణం చేసేవారు కేంద్రం సూచించిన కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఈస్ట్‌కోస్ట్ వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠీ పేర్కొన్నారు. స్టేషన్‌లో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు కాబట్టి నిర్ణీత సమయం కంటే ముందే స్టేషన్‌కు రావాల్సి ఉంటుందన్నారు.

టికెట్లు కన్ఫామ్ అయిన వారు మాత్రమే స్టేషన్‌కు రావాలని తెలిపారు. రైలు ఎక్కేటప్పుడు ప్రయాణికులు విధిగా మాస్క్ ధరించాలని సూచించారు.కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలిపారు.

రైలులోనూ భౌతిక దూరం తప్పనిసరని స్పష్టం చేశారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత ఆయా రాష్ట్రాల హెల్త్ ప్రొటోకాల్‌ను అనుసరించాలని సూచించారు.

Related posts