telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ కేసులో రకుల్, సారా అలీఖాన్ పేర్లను వెల్లడించిన రియా…!

Rakul

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఇప్పటికే ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో రియాను నిందితురాలుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. అయితే రియా బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. కానీ కోర్టు రియాకు బెయిల్ నిరాకరించి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆమె బైకుల్లా జైల్లో ఉన్నారు. డ్ర‌గ్స్ కేసుతో సంబంధం ఉండ‌డంతో ఆమెకు క‌ఠిన శిక్ష ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు. కాగా ఈ కేసులో రియా సోద‌రుడు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తితో పాటు మ‌రికొందరి బెయిల్ పిటిష‌న్లు కూడా తిరస్క‌ర‌ణ‌కు గురి కావ‌డం గ‌మ‌నార్హం. మరోవైపు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో మరో 15 మంది సెలబ్రిటీల పేర్లను రియా వెల్లడించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరందరినీ విచారించేందుకు ఎన్సీబీ సిద్ధమవుతోంది. అయితే ఈ 15 మంది బాలీవుడ్ లో బీ-కేటగిరీకి చెందిన యాక్టర్లని తెలుస్తోంది. వారిలో టాలీవుడ్ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉంది. అంతే కాకుండా సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, రణవీర్ సింగ్ స్నేహితురాలి పేర్లను కూడా వెల్లడించినట్టు తెలుస్తుంది.

Related posts