telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణ‌లో 1,54,880కు చేరిన కోవిడ్ కేసులు!

Corona

తెలంగాణ‌లో క‌రోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,278 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో మృతి చెందగా, 2,458 మంది కోలుకున్నారు.

గతంలో పట్టణాలకె పరిమితమైన కరోనా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో విజృంభిస్తోంది. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,54,880కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,21,925 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 950కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 331 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Related posts