telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

బంగ్లా సిరీస్ లో .. డేనైట్‌ టెస్టు .. బీసీసీఐ కోరిక..

sourav ganguly as bcci president

బీసీసీఐ డేనైట్‌ టెస్టు ఆడాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ని కోరిందని బీసీబీ ఆపరేషన్స్ ఛైర్మన్‌ అక్రమ్‌ఖాన్‌ తెలిపారు. దీనిపై రెండు రోజుల్లో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. డేనైట్‌ టెస్టు ఆడాలని బీసీసీఐ కోరింది. మూడు రోజుల మందు బీసీసీఐ నుంచి లేఖ అందింది. రెండు రోజుల్లో దానిపై ఆలోచించి మా నిర్ణయాన్ని వెల్లడిస్తాం. ఇప్పటివరకు దాని గురించి ఆలోచించలేదని అక్రమ్‌ఖాన్‌ క్రిక్‌బజ్‌కు తెలిపారు. ఆటగాళ్లు, జట్టు యాజమాన్యంతో చర్చించిన తర్వాత డేనైట్‌పై నిర్ణయాన్ని తీసుకుంటామని బీసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిజాముద్దీన్‌ చౌదరి అన్నారు. డేనైట్‌ టెస్టు గురించి ముందుగా ఆటగాళ్లు, జట్టు యాజమాన్యం గురించి చర్చిస్తాం. డేనైట్‌ టెస్టు నైపుణ్యానికి సంబంధించినది. పింక్‌ బంతితో వారు సన్నద్ధమవ్వడానికి సమయం ఉందా లేదా అనే దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

ఇప్పటికే డేనైట్‌ టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సముఖంగా ఉన్నాడని బీసీసీఐ అధ్యక్షడు సౌరభ్‌ గంగూలీ పేర్కొన్న విషయం తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో భారత్ ఆఖరి టెస్టును కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో ఆడాల్సి ఉంది. బీసీబీ డేనైట్‌ టెస్టుకు అంగీకరిస్తే దాదా సొంత మైదానమైన ఈడెన్‌ గార్డెన్స్‌లో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నవంబర్‌3న దిల్లీ వేదికగా బంగ్లాతో టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌ను తలపడనుంది.

Related posts