telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వారంలో నాలుగు రోజులు సిద్ధిపేటలో ఉంటా: హరీశ్ రావు

harish rao trs

తెలంగాణ మంత్రి హరీష్ రావుకు సొంత నియోజక వర్గం సిద్ధిపేటలో మంచి గుర్తింపు ఉంది. ఆయనను అక్కడి ప్రజలంతా తమ కుటుంబసభ్యుడిగానే భావిస్తారు. ఆయనను కలవడానికి అభిమానులు భారీగా ఖర్చు పెట్టుకుని హైదరాబాదుకు వస్తుంటారు. ఇది హరీశ్ ను చాలా ఇబ్బందికి గురి చేస్తోంది. దీంతో వారంలో నాలుగు రోజులు సిద్ధిపేటలో ఉంటానని అందరం సిద్ధిపేటలోనే కలుద్దామని హరీశ్ సూచించారు.

డబ్బులు ఖర్చు చేసుకుని హైదరాబాదుకు రావద్దని, పని కాకపోతే మీ మనసు నొచ్చుకుంటుందని హరీశ్ ట్వీట్ చేశారు. వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని హైదరాబాదుకు రావద్దని తెలిపారు. మీరొచ్చే పనుల్లో 90 శాతం జరగని పనులు ఉంటాయని అప్పుడు డబ్బంతా వేస్ట్ కదా అని అన్నారు. ఆసుపత్రికి రావాల్సిన పని ఉంటేనే హైదరాబాదుకు రావాలని కోరారు.

Related posts