ఆర్టికల్ 370 రద్దు అనంతరం పరిస్థితులను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌లో మొబైల్ సేవలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 69 రోజుల తర్వాత కేంద్రం ఈ నిషేదాజ్ఞలు ఎత్తివేయనుంది. దీంతో పోస్ట్ పేయిడ్ అన్ని మొబైల్ సేవలు కశ్మీర్‌లో సోమవారం నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. వాస్తవానికి పోస్ట్ పేయిడ్ మొబైల్ సేవలు నేటి నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక సమస్యల కారణంగా సోమవారానికి వాయిదా వేశారు.
కాగా ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు మాత్రం మరికొంత సమయం పడనున్నట్లు సమాచారం. కశ్మీర్ సందర్శనకు పర్యాటకులకు కేంద్రం ద్వారాలు తెరవడంతో స్థానిక ట్రావెల్ అసోషియేషన్ సంస్థలు అధికారులను ఆశ్రయించి విజ్ఞప్తి చేశారు. దీంతో తిరిగి సోమవారం నుంచి కశ్మీర్‌లో మొబైల్ సేవలు ప్రారంభం కానున్నాయి.