telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వాజ్ పేయి రికార్డును దాటేసిన మోదీ

pm modi on kargil day

కాంగ్రెసేతర ప్రధానిగా నరేంద్ర మోదీ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు మాజీ ప్రధాని దివంగత వాజ్ పేయి పేరిట ఉండగా మోదీ దాన్ని సవరించారు. ఇదే సమయంలో ఎక్కువ కాలం పాటు అధికారంలో ఉన్న నాలుగో ప్రధానిగానూ ఆయన నిలిచారు. ఈ విషయాన్ని తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రసార భారతి తెలియజేసింది.

భారత ప్రధానిగా తొలిసారి 2014, మే 26న తొలిసారి, ఆపై 2019లో మే 30న రెండోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. వాజ్ పేయి 2,268 రోజులు ప్రధాని పదవిలో ఉండగా, మోదీ దాన్ని నిన్నటితో దాటేశారు. ఇండియాను అత్యధిక కాలం పాటు పాలించిన వారిలో జవహర్ లాల్ నెహ్రూ తొలిస్థానంలో ఉన్నారు. ఆయన 17 సంవత్సరాల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించారు. ఆపై ఆయన కుమార్తె ఇందిరా గాంధీ 11 ఏళ్లు, మన్మోహన్ సింగ్ పదేళ్లు ప్రధానిగా పనిచేశారు. వారి ముగ్గురి తరువాతి స్థానానికి నరేంద్ర మోదీ చేరుకున్నారు.

Related posts