telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా టీకా తీసుకున్న తొలి మహిళ ఈమెనే….

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ 10:30 కి వర్చువల్‌ విధానంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు ఇస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభంమైంది. వర్చువల్‌ విధానంలో ప్రధాని మోడీ కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించిన అనంతరం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కలిసి ప్రారంభించారు. అయితే…గాంధీ ఆస్పత్రిలో సఫాయి కర్మచారి కృష్ణమ్మ మొదటి టీకా వేసుకుంది. టీకా వేసుకున్న మొదటి వ్యక్తిగా కృష్ణమ్మ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. ICMR గైడ్ లెన్స్ ప్రకారమే కరోనా బాధితులకు వైద్యం అందించామని ఈటల పేర్కొన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్ మన దేశం అందించడం గర్వకారణమన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… వ్యాక్సిన్ కనుకొన్నప్పటికి… ఉత్పత్తి కి సమయం పడుతుందని… కనిపించని శత్రువుతో ఇన్నాళ్లు యుద్ధం చేశామన్నారు కిషన్ రెడ్డి. రెండో దశలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తామని.. వ్యాక్సిన్ అందే వరకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ రోజు వ్యాక్సిన్ వేసుకున్న వారు 28 రోజుల తర్వాత మళ్ళీ వేసుకోవాలని పేర్కొన్నారు.

Related posts