ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్, వైసీపీగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని కామెంట్లు చేసినా… నిమ్మగడ్డ తగ్గడం లేదు. ఇది ఇలా ఉండగా.. ఏకగ్రీవాల కోసం వైసీపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంటే.. నిమ్మగడ్డ మాత్రం ఏకగ్రీవాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. బలవంతపు ఏకగ్రీవాలు దారుణమని చెబుతున్నారు. అయినప్పటికీ ఏపీలో విపరీతంగా ఏకగ్రీవాలు పెరిగాయి.. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు తాత్కాలికంగా నిలిపివేశారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. ఆయా జిల్లాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వాటిని పెండింగ్ లో పెట్టాలని ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. రెండు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడంతో పెండింగులో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు నిమ్మగడ్డ. తదుపరి ఆదేశాలు ఇచ్చేవారకూ ఏకగ్రీవాలను పెండింగ్ లో పెట్టాలని ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు.
previous post
తమ గదికి రాలేదని సినిమాల నుంచి తొలగించిన నీచులు… రిచా చద్దా సంచలన వ్యాఖ్యలు