కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ చేసిన సహాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముంబైతోపాటు వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సురక్షితంగా ఇంటికి పంపించిన సోనూసూద్ నెటిజన్లు, రాజకీయ నాయకులు ప్రసంశించారు . వలసకార్మికులను తమ స్వగ్రామాలకు పంపించేందుకు సోనూ బస్సులు, రైళ్లతోపాటు విమాన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
సోనూసూద్ మరోసారి మానవత్వం చాటుకున్నాడు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించేందుకు ముందుకొచ్చాడు. గంపలగూడెం మండలం ఆర్లపాడుకు మండలంలోని ఆర్లపాడు గ్రామానికి చెందిన పుల్లయ్య, కోటమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. వీరిలో చిన్న పాప గాయత్రి గుండె సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. పాప చికిత్స కోసం అప్పులు చేసి విజయవాడ, హైదరాబాద్‌లో పెద్దాసుపత్రులకు తిరిగారు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో కూతురు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకు గురయ్యారు. సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం తెలుసుకున్న సోనూసూద్.. పాప గుండె ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులు భరిస్తానని ప్రకటించాడు. సోనూసూద్ స్పందించండంతో ఆర్లపాడు గ్రామాస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.