టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో ఆరాధ్యుడేనని ఆయన సతీమణి, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి అన్నారు. నేడు ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్టీఆర్ ఆత్మ శాంతించలేదనీ, ఘోషిస్తోందని వ్యాఖ్యానించారు.
తన గుండెల్లో మంట చల్లారలేదని, కళ్లలో నీరు ఆగలేదని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ను చంపినవాళ్లు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్ మహిళలను ఎంతగానో గౌరవించేవారని ఆమె గుర్తు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం టీడీపీ నేతలు మహిళలను కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.