telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

హైదరాబాద్ లో .. మెట్రో ఉద్యోగాల పేరుతో మోసం… 80 లక్షలు వసూలు ..

hightech city metro by this month last week

నిరుద్యోగులు ప్రతి రోజు ఏదోఒక మూలన ఎవరో ఒకరి చేతిలో మోసపోతూనే ఉన్నారు. ఎవరో ఉద్యోగం ఇప్పిస్తాం అనగానే వేలకు వేలు వారి చేతిలో పెట్టేస్తున్నారు. దీనికంతటికి కారణం, ఉద్యోగం సాధించడానికి సులభ మార్గాలు వెతకడం, మొదట ఆయా మార్గాలలో ఉద్యోగ వేట ఆపితేనే ఇటువంటి నేరాలకు చెక్ పెట్టవచ్చు; లేదంటే జరుగుతూనే ఉంటాయి. తాజాగా, హైదరాబాద్ నగరంలో మెట్రో లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురు నిరుద్యోగుల నుండి 80 లక్షలు వసూలు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన వెలగపూడి రామకృష్ణ హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో స్థిరపడ్డాడు. పలు సంస్థల్లో పీఆర్ఓగా పనిచేసిన ఆయన, నిజామాబాద్‌కు చెందిన చిల్ల మహాలక్ష్మి, హైదరాబాద్ ఎస్సార్ నగర్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది గడ్డం శ్రీధర్‌రెడ్డి, మంచిర్యాలకు చెందిన బండారు లక్ష్మణరావులు ఓ ముఠాగా ఏర్పడ్డారు.

ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో కొత్త దారులు వెతికిన నిందితుడు రామకృష్ణ ఎల్ అండ్ టీ వైస్ ప్రెసిడెంట్ పి.రాధికారెడ్డి పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు సృష్టించి ఇచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న చిత్తూరు జిల్లాకు చెందిన లావణ్య తనకందిన అపాయింట్‌మెంట్ లెటర్‌తో మెట్రో అధికారులను కలవడంతో మోసం వెలుగులోకి వచ్చింది.

మోసపోయిన ఆమె ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామకృష్ణ, మహాలక్ష్మిలను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీధర్‌రెడ్డి, లక్ష్మణరావు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి కారు, నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, రూ. 70 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Related posts