ఓ ప్రియదర్శినీ!
వలపుల కర్తవే –
తొలకరి వృష్టివే
శీత కిరణాల పూర్ణిమవే
నా హృదయంలో ప్రేమ స్పందనవే
స్వాగత గీతానివే
ప్రణయ భావాల పరిమళానివే
భువిలో అమృత ఝరివే
నా జీవిత భాగ్యోదయానివే
నాకోసం వచ్చిన నీవే
దివిజ లోక వాసవే
నా ప్రేమ విపంచివే
నాలో దాగిన పలుకరింపువే
దివ్య మంగళ రూపానివే
అమర పీయూష ధారవే
ఆర్ద్రత నిండిన హృదయానివే
కోమలమైన విరి దండవే
ఓ ప్రియదర్శినీ!
నీ మది నిండ నేనుండ
నా మది నిండ నీవుండ
ప్రణయ తపస్సులో ప్రవహిస్తున్నా
నీ గుండె గూటిలో నివసిస్తున్నా
-మహేంద్రాడ సింహాచలాచార్య, టెక్కలి
ఆ వ్యాఖ్యల వల్ల సూసైడ్ చేసుకుందామనుకున్నా… సీనియర్ నటుడు చలపతిరావు