telugu navyamedia
సినిమా వార్తలు

స‌మంత ఐటెమ్ సాంగ్ రిలీజ్‌..

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఊర మాస్ గెటప్ లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా లో పుష్ప‌రాజ్ ప్రేమికురాలుగా రష్మిక మందన్న సంద‌డి చేయ‌నుంది.

Samantha's sizzling song from Allu Arjun's Pushpa to release on December  10. - The PrimeTime News

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు సినిమా పై ఆసక్తి పెంచేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తార స్థాయికి చేర్చింది. తాజాగా ఈ సినిమానుంచి మాస్ మసాలా సాంగ్ ను విడుదల చేశారు.

అల్లుఅర్జున్ అభిమానులతోపాటు సమంత ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పుష్ప’ స్పెషల్ సాంగ్ వచ్చేసింది. ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా’ అంటూ సమంత ఈ పాటలో యూత్‌ను ఉర్రుతలూగించేలా ఆ ఫోటోలను బట్టి, ఆ భంగిమలను బట్టి రచ్చరచ్చ చేసినట్టు కనిపిస్తోంది. ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..’ అంటూ సాగిన ఈ సాంగ్‌ లిరికల్‌ వీడియో శుక్రవారం సాయంత్రం రిలీజైంది.

ఈ పాటలో లంగా జాకెట్‌లో కనిపించిన సమంత తన అందచందాలను ఆరబోస్తూ మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.కాగా ఇప్ప‌టివ‌ర‌కు కెరీర్‌లో ఒక్క‌సారి కూడా స్పెషల్‌ సాంగ్స్ చేయ‌ని సామ్‌ మొద‌టిసారిగా బ‌న్నీ కోసం ఈ సాంగ్‌లో స్టెప్పులేసింది.

ఈ సినిమా కు దేవీ శ్రీ సంగీతం అందిస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం అందించగా.. ఇంద్రావతి చౌహన్ ఆలపించారు. ఈ పాట సినిమాకు ఓ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు చిత్రయూనిట్.

ఇక ఈ సినిమా డిసెంబర్ 17న గ్రాండ్ గా విడుదలకానుంది. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమా 5 భాషల్లో విడుదుల కానుంది. ఇక డిసెంబర్ 12 ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఇక మలయాళ స్టార్ నటుడు సునీల్ , ఫహద్ ఫాజిల్ ప్ర‌త్యేక పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

Related posts