telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కన్నడ బిగ్ బాస్ లో .. లైంగిక వేధింపులు.. పిర్యాదు చేసిన ..

complaint filed on kannada bigg boss

బుల్లితెర సూపర్ హిట్ షో అయిన విషయం తెలిసిందే. ఒక్క తెలుగులోనే కాకుండా అనేక దేశంలోని అనేక బాషలలో ఈ షో హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే అంతే స్థాయిలో విమర్శలు కూడా వస్తుండటం విశేషం. ఇటీవల విమర్శలు కూడా ప్రమోషన్స్ లో భాగం అయిపోయాయి. తాజాగా, కన్నడ బిగ్ బాస్ పోటీల్లో పాల్గొని, మధ్యలోనే బయటకు వచ్చేసిన కవితా గౌడ, తన సహ కంటెస్టెంట్ యాండీపై సంచలన విమర్శలు చేసింది. హౌస్ లో యాండీ తనను లైంగికంగా హింసించాడని ఆరోపిస్తూ, ఆమె మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. షోలో జరిగిన వేధింపుల గురించి కార్యక్రమం నిర్మాత గురుదాస్ శణైకి ముందే చెప్పానని, తనకు జరిగిన అన్యాయంపై బయటకు వచ్చిన తరువాతనే నోరు విప్పుతున్నానని పేర్కొంది.

షోలో భాగంగా రెండు రోజుల పాటు ‘సూపర్‌ హీరో వర్సెస్‌ సూపర్‌ విలన్‌’ టాస్క్‌ జరిగిన సమయంలో యాండీ లైంగిక వేధింపులకు దిగాడని ఆరోపించింది. కవితా గౌడ ఆరోపణలను యాండీ తీవ్రంగా ఖండించాడు. బిగ్‌ బాస్‌ పోటీల తరువాత ఆమెను తాను కలవలేదని అన్నాడు. ఓటమిని తట్టుకోలేక కవిత తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ప్రత్యారోపణలు చేశాడు. అయితే ఆమె ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ కొనసాగుతుంది.

Related posts