telugu navyamedia
సినిమా వార్తలు

సల్మాన్ ఖాన్‌ బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా

ఈ రోజుల్లోనిజంగా ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధపడే స్వార్థం లేని బాడీగార్డ్స్ దొరకడం కష్టమే. కానీ సల్మాన్ ఖాన్‌కు అలాంటి వాడే దొరికాడు. అతడి పేరు షెరా. పేరుకు అంగరక్షకుడు కానీ సల్మాన్ ఖాన్‌ సొంతింటి మనిషిలాగే ట్రీట్ చేస్తాడు అతన్ని. ఇక షెరా కూడా తన ప్రాణం కంటే సల్మాన్ ప్రాణమే ముఖ్యమంటాడు. ఈ ఇద్దరూ అలా కలిసిపోయారు. 1996 నుంచి సల్మాన్ కోసం అంగరక్షకుడిగా పని చేస్తున్నాడు షెరా. బయట ఎంతమంది ఆఫర్ చేసినా కూడా అక్కడే పని చేస్తున్నాడు షెరా. అందుకే సల్మాన్ కూడా అతడికి కావాల్సినంత జీతం ఇస్తున్నాడు. ఏకంగా 15 నుంచి 20 లక్షల వరకు ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. దానికితోడు అదనపు అలవెన్సులు కూడా ఉంటాయి. మొత్తంగా ఏడాదికి దాదాపు 2.5 కోట్ల వరకు షెరా సంపాదన ఉంటుందని లెక్కలు కడుతున్నారు బాలీవుడ్ వర్గాలు. ఈ మధ్యే ఆయనకు ఓ సొంతిల్లు కూడా కొనిచ్చాడు సల్మాన్ ఖాన్. ఇది చూసి నిజంగానే అంతా షాక్ అవుతున్నారు.

Related posts